Pages

FAQ on Varalakshmi Vratham

FAQ on Varalakshmi Vratham
FAQ on Varalakshmi Vratham
World is celebrating Varalakshmi Vratham. Happy Varalakshmi Vratham.

సకల సౌఖ్యాల వరలక్ష్మీ
 
హిందువుల సనాతన ఆచారాల్లో వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు అత్యంత ప్రధానమైనది. అష్ట ఐశ్వర్యాలను, సంతానాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మహిళలు లక్ష్మీదేవికి చేసే వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీలు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఈ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి పలు ఆలయాలు సిద్ధం కాగా, మహిళలు సంసిద్ధులవుతున్నారు.

వ్రతం ఎలా మొదలైంది..? (When Varalakshmi Vratham Started?)
 
వరలక్ష్మీ వ్రతం ఎలా చేస్తారనేదానిపై పలు రకాల కథనాలున్నాయి. ఇతిహాసాల ఆధారంగా కైలాసంలో ఉండే పార్వతీ దేవి స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగడానికి ఏంచేయాలో చెప్పమని శివుడిని కోరిందని, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా సఖల సుఖాలు పొందుతారని చెప్పాడని, దీంతో పార్వతీదేవి మొదటగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా అప్పటి నుంచి ప్రజలు ఈ వ్రతాన్ని చేస్తున్నారని ప్రతీతి.

ఎవరు చేస్తారు..? (Who performs Varalakshmi Vratham)
 
వరలక్ష్మీ వ్రతాన్ని వివాహితులైన దంపతులు ఆచరిస్తారు. స్త్రీలు తమ భర్తలతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబం సౌఖ్యంగా ఉంటుందని వేదపండితులు పేర్కొంటున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం భర్త అనుమతితోనే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించాలని చెబుతున్నారు. భర్త అనుమతి లేకుండా చేసిన వృధా అవుతుందని, భర్త అనుమతి, ఆశీర్వాదం తీసుకున్న తరువాతే ఈ వ్రతాన్ని పాటించవలసి ఉంటుంది. వివాహం కాని యువతులు కూడా తమ భవిష్యత్తు కోసం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని చెప్పారు.

ఎప్పుడు చేస్తారు..? (When to Perform Varalakshmi Vratham)
 
ఇతిహాసాల ప్రకారం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో మూడో శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం విష్ణువుకు అత్యంత ప్రీతిపావూతమైన మాసం. కనుక ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మాసాన్ని మాధవ మాసం అనికూడా పిలుస్తారు. నిండు శ్రావణం మూడో శుక్రవారం ఉదయాన్ని స్నానం చేసి కంకణం కట్టుకొని వ్రతం చేస్తారు.

ఎందుకు చేస్తారు..? (Why Perform Varalakshmi Vratham)
 
మహిళలు ఎక్కువగా వరలక్ష్మీ వ్రతాన్ని మాంగళ్య బలం కోసం చేస్తారు. అడిగిన వరాలిచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. భక్తులు తమకు కావలసినవి కోరుకుంటే వరలక్ష్మీదేవి తప్పకుండా కోరికలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఐశ్వర్యం, సంతానం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం ద్వారా అష్ట లక్ష్మీ దేవతలను మెప్పించి తమ జీవితం సుఖమయంగా ఉండేలా చూడాలని ప్రార్థిస్తారు.

వ్రతానికి కావలసినవి.. (Things needed to perform Varalakshmi Vratham)
 
భక్తిలేని వ్రతం వ్యర్థమని, వారు బంగారు కమలాలు సమర్పించినా అవి భగవంతుడికి చేరవని పండితులు చెబుతున్నారు. భక్తితో ఒక్క పుష్పం సమర్పించినా అమ్మవారు కరుణిస్తుందని పేర్కొన్నారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి మొదటగా కావలసింది నిశ్చలమైన మనస్సు, భక్తితోపాటు భర్త అనుమతి.

పూజలో ఉపయోగించే వస్తువులు. .  (Things needed for Varalakshmi Puja)

పసుపు, కుంకుమ, కర్జూర పండ్లు, వక్కలు, పసుపుకొమ్ములు, తమలపాకులు, అరటిపళ్లు, 5కిలోల బియ్యం, తుండుగుడ్డ, 5కొబ్బరికాయలు, మామిడి ఆకులు, పంచామృతానికి కావలసిన పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనే, కళశాలకు రెండు చెంబులు, రెండు జాకెట్ గుడ్డలు, అమ్మవారి ఫొటో, ప్రతిమలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.

ఎలా ఆచరిస్తారు..? (How to Perform Varalakshmi Vratham)
 
నిశ్చలమైన మనసుతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. మొదటగా విష్ణువు ప్రార్థన చేసి అన్ని గణాలకు అధిపతి అయిన వినాయకుడికి పూజ చేయాలి. అనంతరం నవక్షిగహారాధన, లక్ష్మీపూజ, వరలక్ష్మీ కథ, మంగళహారతి, తీర్థ్ధవూపసాద వితరణతో వ్రతం ముగుస్తుంది. తామర పుష్పంతో వ్రతం చేస్తే మోక్షం కలుగుతుందని, కుంకుమతో చేస్తే ధనం, పసుపుతో ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది. 

No comments:

Post a Comment